Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 June 2026, 7:21 pm Posted by : ramakrishna

నిజామాబాద్ ఎస్సీ మోర్చ జిల్లా అధ్యక్షుడిగా పొతుల పురుషోత్తం

 

. . . కామారెడ్డి అధ్యక్షుడిగా రేవన్

 

 నిజామాబాద్, బతుకమ్మ :

 

తెలంగాణలో బిజేపి పార్టీలో అనుబంధ విభాగాలకు జిల్లాల వారిగా నియమాకాలు చేపట్టింది. శుక్రవారం బిజేపి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా నిజామాబాద్ నగరంకు చెందిన మాజీ కార్పోరేటర్ పోతుల పురుషోత్తంను నియమిస్తు రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు రాంచంద్రరావు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో 32  జిల్లాలకు ఎస్సీ మోర్చాలకు అధ్యక్షులను నియమించగా నిజామాబాద్ అధ్యక్షుడిగా పురుషోత్తం, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా రేవన్ లను నియమించారు. తనను జిల్లా అధ్యక్షుడిగా నియమించిన పార్టీ అధ్యక్షుడు రాంచందర్ రావు, నిజామాబాద్ ఎంపి అరవింద్ ధర్మపురి, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణలకు పురుషోత్తం ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో బిజేపి బలోపేతంకు తనవంతుగా పాటు పడుతానని అన్నారు.