ఎల్లారెడ్డి,బతుకమ్మ: కామారెడ్డి జిల్లాలో భారతీయ జనతా పార్టీ నూతన కార్యవర్గ సభ్యుల నియామకంలో భాగంగా పోతుగంటి సాయిలు విశ్వాసాన్ని పొందుతూ జిల్లా స్థాయి కార్యవర్గ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఆయనకు ఈ పదవిలో ఎన్నిక కావడం జిల్లాలో హర్షాతిరేకాలు నెలకొన్నాయి. పొతుగంటి సాయిలు గతంలో సుదీర్ఘకాలం పాటు ప్రజాసేవలో నిమగ్నమై, స్థానిక సమస్యలపై నిరంతర పోరాటం చేసిన కృషికి గుర్తింపుగా ఈ పదవి లభించింది. ఆయన నాయకత్వం జిల్లాలో అభివృద్ధి పనులకు దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుతూ, నాకు ఈ అవకాశం కలిగించిన భారతీయ జనతా పార్టీకి, అలాగే ప్రతీ ఒక్క నాయకునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని, నిశ్చయిస్తున్నాను” అని చెప్పారు.