Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 January 2025, 4:04 pm Posted by : ramakrishna

పోస్ట్ మాస్టర్ వ్యాఖ్యలతో పోస్ట్ మెన్ ఆత్మహత్యాయత్నం

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పోస్టల్ లైఫ్ ఇన్సురెన్స్, సేవింగ్ అకౌంట్స్ టార్గెట్ రీచ్ కాలేదని తోటి ఉద్యోగుల ముందు పోస్ట్ మాస్టర్ చేసిన వ్యాఖ్యలతో పోస్ట్ మెన్ కలత చెందాడు. తన గ్రామంలోని పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అంతకు ముందు పోస్ట్ మెన్ తనకు జరిగిన అవమానం, తాను బాధపడుతున్న తీరును తీసిన సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది. ఈ సంఘటన మంగళవారం నిజామాబాద్ జిల్లా ఆలూర్ గ్రామంలో జరిగింది. ఆలూర్ మండల కేంద్రానికి చెందిన ఆలూర్ గంగాధర్ పోస్ట్ మెన్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల కాలంలో  గంగాధర్ విధులు నిర్వహించే చోట టార్గెట్ ల విషయంలో తోటి పోస్ట్ మెన్ ల ముందు పోస్ట్ మాస్టర్ అజయ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. దానితో మనస్థాపం చెందిన గంగాధర్ పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించాడు. అతడిని కుటుంబ సభ్యులు ఆర్మూర్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా గంగాధర్ చికిత్స పొందుతున్నాడు.