నిజామాబాద్, బతుకమ్మ : గత కొన్ని రోజులుగా వీఆర్ లో అటాచ్ ఉన్న ఎస్ఐలకు పోస్టింగ్ ఇస్తూ సీపీ సాయి చైతన్య శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్ లో అటాచ్ ఉన్న ఎస్ఐ గోవింద, సిరివేరి మహేష్, గంగుల మహేష్ లను సీసీఎస్ నిజామాబాద్ కు, గురక మహేష్ ను వన్ టౌన్ కు, సమ శ్రీనివాస్ ను నిజామాబాద్ రూరల్ రెండో ఎస్ఐగా, మొగులయ్యను మాక్లూర్ రెండవ ఎస్ఐగా, వినయ్ కుమార్ ను ఆర్మూర్ టౌన్ కు, సయన్ రావు సీఎస్ నిజామాబాద్ కు, ఎస్.రాజును కలెక్టరేట్ కు బదిలీ చేశారు. అందరూ వెంటనే వారికి అలాట్ చేసిన స్థానాలలో రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు.