Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 April 2025, 7:26 pm Posted by : ramakrishna

వాతావరణ మార్పులు- ప్రభావం, వడదెబ్బపై పోస్టర్ల ఆవిష్కరణ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్  రాజీవ్ గాంధీ హనుమంతు చేతులమీదుగా వాతావరణ మార్పులు దాని ప్రభావం వడదెబ్బ నుండి రక్షించుకుందాం అనే పోస్టర్లను జిల్లా అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థలు అంకిత్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాతావరణ మార్పులు దాని ప్రభావం వల్ల తీవ్రమైన వేడి తో కూడిన ఎండలు ఉన్నందువల్ల జిల్లా ప్రజలంతా సరియైన జాగ్రత్తలు తీసు కోవాలన్నారు. ముఖ్యంగా వీలైనంతవరకు ఇంట్లోనే ఉండడం, సరిపడా ద్రవాలు తీసుకోవడం, కాటన్ వస్త్రాలను ధరించడం ,తొందరగా వడదెబ్బకు గురయ్యే వారు ఇతరుల కన్నా ఎక్కువ జాగ్రత్తగా ఉండడం. వివిధ శాఖల జిల్లా అధికారులు వడదెబ్బ నివారణ పైవారి ప్రణాళిక కనుగుణంగా చేయవలసినవి చేయకూడనివి పాటించేలా చూడాలన్నారు. అదేవిధంగా యజమానులు వారి వద్ద పనిచేసే కార్మికుల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ గారు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ గారు, పి ఓ ఎన్ సి డి డాక్టర్ సామ్రాట్ యాదవ్, డిప్యూటీ డెమో నాగలక్ష్మి, డి హెచ్ ఈ ఘన్పూర్ వెంకటేశ్వర్లు, హెచ్ ఈ ఓ నాగరాజు పాల్గొన్నారు.