Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 September 2024, 6:58 pm Posted by : ramakrishna

గణేష్ విగ్రహాల పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆవిష్కరణ

బతుకమ్మ, కామారెడ్డి : వినాయక చవితి పండుగ ను పురస్కరించుకొని ఈ సంవత్సరం, పర్యావరణం పై అవగహన కల్పించేందుకు. మట్టి గణేష్ విగ్రహాల పోస్టర్లను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. పర్యావరణానికి అనుకూలమైన మట్టి విగ్రహాలను ఎర్పాటు చేసుకోని పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉందని కలెక్టర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలలొ భాగాంగ 8 అంగుళాల మట్టి గణపతి లను అందించి పర్యావరణం పై పెద్ద ఎత్తున అహగహన కార్యక్రమాలు టిజిపిసీబీ    నిర్వహంచడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అవగాహన కార్యక్రమాలలొ బాగంగా రాష్ట్ర వ్యాప్తం గా పర్యావరణ గణేష్ పోస్టర్ల ప్రదర్శన ఆటోట్రాలీ ల ద్వారా పర్యావరణ సందేశంలతో ప్రదర్శన, ప్రింట్, ఎలక్ట్రనిక్ మీడియా ద్వారా ప్రచార కార్యక్రమాలు చేపట్టేందుకు టిజిపిసీబీ సిద్దమౌతుందని అన్నారు. మట్టి గణపతి ద్యారా పర్యావరణ పరిరక్షణ పై పాఠశాలలో, కళాశాలల్లో క్వీజ్ కార్యక్రమాలు నిర్వహించడం, చేతి వృత్తిల వారికి మట్టి విగ్రహలు తయారిపై శిక్షణ, ఆటోల వెనుక, పోస్టర్ల ప్రదర్శన, బస్టాప్ లలో హోర్డింగ్ లు మట్టి గణేష్ ల ద్యారా పర్యావరణ పరిరక్షణ పై కళాజాత కూడ నిర్వహించడం జరుగుతోందని అన్నారు. చెరువుల్లో మట్టి మేటలని తొలిగించటానికి చెరువులో స్వచ్ఛత కాపాడటానికి వినాయక చవితి సందర్బంగా ప్రజలు భక్తులు నడుము బిగించాలాని మట్టి తో వినాయక విగ్రహాలు తయారు చేసి భక్తితో చెరువులోకి చేర్చొచ్చని ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ చైతన్యవంతం చేసే ప్రయత్నం చేసారు.