సీఎల్సీ రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
బోధన్, బతుకమ్మ : పౌర హక్కుల సంఘం (సీఎల్సీ) తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలు నవంబర్ 8,9 తేదీలలో హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్నాయి. రాష్ట్ర మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్లను గురువారం బోధన్ పట్టణంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు వి.సంగం, ఉపాధ్యక్షులు గుర్రం జలంధర్, న్యాయవాది వీర భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.