Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 April 2026, 7:23 pm Posted by : ramakrishna

సీఎం ఇంటికి పాదయాత్ర పోస్టర్ ఆవిష్కరణ

 

. . . ఫీజు రీ ఎంబర్స్ మెంట్ స్కాలర్ షిప్ లను విడుదల చేయాలని పాదయాత్ర

 

. . . ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘురాం

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికి పాదయాత్ర నిర్వహించే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ని ఆవిష్కరించారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రీ ఎంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లను విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 28న నిర్వహించే పాదయాత్ర పోస్టర్ ని శుక్రవారం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘురాం నాయక్‌ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 8300 కోట్ల రూపాయలు స్కాలర్ షిప్ బకాయిలు ఉండడం వలన పేద మధ్య తరగతి విద్యార్థులు చదువుకు దూరమైన పరిస్థితి ఉందన్నారు. ఫీజు రీ ఎంబర్స్ మెంట్ విడుదల చేయాలని నిర్వహించే ఈ పాదయాత్రను విద్యార్థులందరూ కలిసి విజయవంతం చేయాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా సమితి సభ్యుడు కిషోర్ నగర నాయకులు దిలీప్, గణేష్, నిరాజ్, శివ, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.