Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 August 2024, 5:51 pm Posted by : ramakrishna

ఇంటర్ లో డిలీట్ ఆప్షన్ కు అవకాశం

  • జిల్లా ఇంటర్ విద్య అధికారి

బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర అన్ని రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ఫస్టియర్ లో చేరి ఇతర కళాశాలలో చేరేందుకు గాను డిలీట్ ఆప్షన్ ఆగస్టు 31వ తేదీ ఒకరోజు మాత్రమే ఆన్లైన్లో అందుబాటులో ఉంటుందని జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపూడి రవికుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు. రాష్ట్ర ఇంటర్ విద్య కమిషనర్ ఆదేశాల మేరకు ప్రైవేటు జూనియర్ కళాశాలల యాజమాన్యాలు లేదా ప్రిన్సిపాల్ లు తమ కళాశాలల్లో చేరిన విద్యార్థులు ఇతర కళాశాలలో చేరడానికి విద్యార్థుల కోరిక మేరకు అడ్మిషన్ డిలీట్ చేయాలని ఆదేశించారు. విద్యార్థులు తమ ఇష్టమైన కళాశాలలో లేదా ఇతర గ్రూపులోకి చేరడానికి అవకాశం కల్పించాలని ఆదేశించారు. ప్రైవేట్ యాజమాన్యాలు, ప్రిన్సిపాల్ లు విద్యార్థుల డిలీట్ ఆప్షన్ చేయకుండా వారి వద్ద ఫీజులు వసూలు చేయడం గానీ, ఇతర ఎలాంటి ఇబ్బందులకు గురిచేసిన శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఇంటర్ విద్య అధికారి హెచ్చరించారు. అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం లో అడ్మిషన్ పొందడానికి సెప్టెంబర్ ఏడవ తేదీ వరకు ఇంటర్ బోర్డు పొడిగించిందని ఈ అవకాశాన్ని విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో చేరాడ్నికి పేద, బడుగు, బలహీనర్గాలకు చెందిన, మైనారిటీ విద్యార్థిని, విద్యార్థులు అందరు సెప్టెంబర్ 7వ తేదీ వరకు అవకాశం ఉందని, ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.