హైదరాబాద్ నుంచి ఎమిరేట్స్ ఎ 380 సర్వీసులపై సానుకూలత
. . . తెలంగాణలో విస్తరణకు ఆసక్తి చూపిన సంస్థ హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ నుంచి ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ఎ 380 విమాన సర్వీసులను ప్రారంభించే అంశంపై ఆ సంస్థ సానుకూలంగా స్పందించింది. ఎమిరేట్స్ విమానయాన సంస్థ (ఇండియా - నేపాల్) వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సర్హన్ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమిరేట్స్ సంస్థ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో విమానయాన రంగ అభివృద్ధి, కొత్త అవకాశాలపై...