Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 December 2025, 5:45 pm Posted by : ramakrishna

పార్టీ కోసం కష్టపడ్డ వారికి పదవులు

  • ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

 

నిజామాబాద్, బతుకమ్మ : పార్టీ కోసం కష్టపడ్డ వారికి పదవులు తప్పకుండా వస్తాయని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. నూతనంగా నియామకమైన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్పల్లి నగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ కాంగ్రెస్ భవన్ లో మంగళవారంబాధ్యతలు తీసుకున్నారు. అనంతరం లక్ష్మీ కళ్యాణ మండపం నందు ప్రమాణ స్వీకార సభ  ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్, పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, వివిధ రాష్ట్ర కార్పొరేషన్ ఛైర్మన్ లు, జిల్లా చైర్మన్లు,నియోజకవర్గ బాధ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు లభించడం ఎంతో అపూర్వ అవకాశామని అన్నారు. పదవులు ఆశించి రాని వాళ్ళుకు భవిష్యత్తులో మంచి అవకాశం కల్పిస్తామన్నారు. పార్టీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారు పార్టీ సిద్ధాంతాలను, విలువలను, ఆశయాలను గౌరవిస్తూ, జిల్లాలో పట్టణంలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని సూచించారు. జిల్లాలోని ప్రతి కార్యకర్తను కలుపుకొని పోతు వారి సలహాలు, సూచనలు తీసుకుంటూ పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేయాలని తెలిపారు. జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో, రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేయాలని తెలిపారు. అందరినీ కలుపుకొని అందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీని జిల్లాలో మరింత ముందుకు  తీసుకువెళ్లాలరిచ ఎల్లవేళలా మా సహకారం మీకు ఉంటుందని అన్నారు.

Positions for those who worked hard for the party

Positions for those who worked hard for the party