కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికే పదవులు
రాంభూపాల్, రామకృష్ణ లకు సన్మానం నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పార్టీలో కష్టపడ్డ వారిని గుర్తించి పదవులు ఇస్తుంది అనడానికి నిజామాబాద్ నగరానికి చెందిన ప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా రాంభూపాల్ కు, క్రమశిక్షణ కమిటీ సభ్యుడిగా రామకృష్ణకు పదవులు దక్కడం నిదర్శనమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ...