Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 June 2025, 7:39 pm Posted by : ramakrishna

కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికే పదవులు

  • రాంభూపాల్, రామకృష్ణ లకు సన్మానం

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పార్టీలో కష్టపడ్డ వారిని గుర్తించి పదవులు ఇస్తుంది అనడానికి నిజామాబాద్ నగరానికి చెందిన ప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా రాంభూపాల్ కు, క్రమశిక్షణ కమిటీ సభ్యుడిగా రామకృష్ణకు పదవులు దక్కడం నిదర్శనమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు ఆధ్వర్యంలో నూతనంగా పిసిసి ప్రధాన కార్యదర్శి గా నియమింపబడిన రాంభూపాల్ కు, క్రమశిక్షణ కమిటీ సభ్యుడు రామకృష్ణ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి,పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రామ్ భూపాల్,రామకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాపై నమ్మకం తో ఈ పదవులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నీ బలోపేతం చేస్తూ వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం సాధించే విధంగా కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి,సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్,జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్,జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగం,జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్,నవాజ్,ప్రీతం,మాజీ ఫ్లోర్ లీడర్ రాజేంద్ర ప్రసాద్,మాజీ కార్పొరేటర్ విజయ,కొండపాక రాజేష్ ,లవంగ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.