ఒంటి కాలిపై హమాలీల నిరసన

బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలోని ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద సివిల్ సప్లై హమాలీల చేపట్టిన సమ్మెలో నాలుగో రోజు ఒంటి కాలుపై నిల్చోని నిరసన వ్యక్తం చేశారు. హమాలీ రేట్ల పెంపుపై జీవో విడుదల చేసి డిమాండ్లను పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు దుబాస్ రాములు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుట్టి సాయిలు, గువ్వ సాయిలు, బక్కని బాలరాజ్, హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.