బిల్డింగ్ ఎక్కిన పొక్లెయిన్
హైదరాబాద్, బతుకమ్మ: భారీ భవనంపై పొక్లెయిన్ చూసిన ప్రజలు ఇది ఎలా సాధ్యమైందని ముక్కున వేలేసుకుంటున్నారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఓ బహుళ అంతస్తుల భవనాన్ని కూల్చి నూతన భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. అయితే పాత భవనాన్ని కూల్చేందుకు పొక్లెయినర్ ను తీసుకువచ్చారు. దానిని భారీ క్రేన్ సాయంతో భవనంపైకి చేర్చగా, కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. భవనంపై పొక్లెయిన్ ఉండడాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకించారు.