- ఏబిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్
కేయూ, బతుకమ్మ : దళిత జాతి ద్రోహి పొన్నం ప్రభాకర్ ని మంత్రి పదవి నుండి తొలగించాలని ఏబిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్ డిమాండ్ చేశారు. మాదిగ సామాజికవర్గానికి చెందిన మంత్రి ఆడ్లురి లక్ష్మణ్ పై అనుచిత వాక్యలు చేసినందుకు నిరసనగా మంత్రి పొన్నం ప్రభాకర్ దిష్టి బొమ్మ దగ్ధం కార్యక్రమం కెయూ రెండొవ గేట్ దగ్గర ఏబిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏభిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్ మాట్లాడుతూ మాదిగ సామాజిక వర్గానికి చెందిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పై అనుచిత వాక్యాలు చేయడం బాధాకరం అని మంద అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో దళితుల ఓట్లతో గెలిచినా పొన్నం ప్రభాకర్ మంత్రి అయ్యాక దళితుల పట్ల అహంకారపు మాటలు మాట్లాడటం సిగ్గు చేటని అన్నారు. ఎస్సీ, బీసీల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్న పొన్నం ప్రభాకర్ ను మంత్రి పదవి నుండి తొలగించి మరో బీసీ వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలని మంద నరేష్ అన్నారు. దళితుల జోలికి వస్తే ఎంతటి వారినైన వదిలిపెట్టమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కెయూ ఏభిఎస్ఎఫ్ నాయకులు అర్షం చరణ్, నందు, పవన్, రాజు, అఖిల్, కిరణ్, సాయి, వెంకటేష్, సూర్య, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
