ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ కింద చెరువులు నింపాలి

మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి   బాల్కొండ, బతుకమ్మ : వర్షాకాలం ప్రారంభం అయ్యి మూడు నెలలు కావస్తున్నా జిల్లాలో కానీ ఇటు బాల్కొండ నియోజకవర్గంలో చెరువులు ఇంకా పూర్తి స్థాయిలో నిండలేదు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో మొత్తం 1086 చెరువులు ఉంటే 377 చెరువులు 25 శాతామే, 424 చెరువులు 50 శాతామే,  204 చెరువులు 75 శాతమే నిండినయి. బాల్కొండ నియోజకవర్గంలో 292 చెరువులకు గాను ఒక్క చెరువు కూడా పూర్తిగా నిండలేదు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో...