Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 August 2025, 7:01 pm Posted by : ramakrishna

ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ కింద చెరువులు నింపాలి

  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

 

బాల్కొండ, బతుకమ్మ : వర్షాకాలం ప్రారంభం అయ్యి మూడు నెలలు కావస్తున్నా జిల్లాలో కానీ ఇటు బాల్కొండ నియోజకవర్గంలో చెరువులు ఇంకా పూర్తి స్థాయిలో నిండలేదు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో మొత్తం 1086 చెరువులు ఉంటే 377 చెరువులు 25 శాతామే, 424 చెరువులు 50 శాతామే,  204 చెరువులు 75 శాతమే నిండినయి. బాల్కొండ నియోజకవర్గంలో 292 చెరువులకు గాను ఒక్క చెరువు కూడా పూర్తిగా నిండలేదు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఒక నెల క్రితమే కాళేశ్వరం రివర్స్ పంపింగ్ స్టార్ట్ చేసి వరద కాలువ ద్వారా నీటిని ఎస్ఆర్ఎస్పీ కి తీసుకొచ్చినట్లైతే,లిఫ్ట్ లు,వరద కాలువ ద్వారా జిల్లాలో అనేక గ్రామాల చెరువులు నిండేవి,వరద కాలువ , కాకతీయ కాలువ ద్వారా సాగుకు నీరు ఇచ్చే అవకాశం ఉండే.అయినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం కేవలం వర్షాల మీద ప్రాజెక్ట్ లోకి వచ్చే నీటి కోసం ఆధారపడి ఉన్నది. సాగు కు నీరు ఇవ్వడానికి వాటర్ మేనేజ్మెంట్ చేయడంలో ఈ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు గత కొన్ని రోజులుగా మంచి వరద కొనసాగుతుంది, ప్రస్తుతం 5658  క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతుంది.45 TMC ల నీటి నిలువ ఉంది. ఇలాగే ఇంకొన్ని రోజులు కూడా వరద కొనసాగుతుందని సెంట్రల్ వాటర్ కమిషన్‌ ఫ్లడ్ ఫోర్‌కాస్ట్‌లో పేర్కొంది. కాబట్టి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ పై ఉన్న గుత్ప,అలీ సాగర్,చౌట్ పల్లి హన్మంత్ రెడ్డి లిఫ్ట్,లక్ష్మీ కెనాల్ మరియు అనేక లిఫ్ట్ లను స్టార్ట్ చేసి  ఆర్మూర్,బాల్కొండ,నిజమాబాద్ రూరల్  నియోజకవర్గంలో అన్ని చెరువులు నింపాలని వరద కాలువ ,కాకతీయ కాలువ ద్వారా సాగు కు నీరివ్వాలని డిమాండ్ చేస్తున్నాం. గత కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ఒక ప్రణాళిక ప్రకారం SRSP పై ఉన్న లిఫ్ట్ మోటార్లు రన్ చేసి నిరంతరం చెరువులు  నింపేవారం..దీనివల్ల జిలాల్లో అటు బాల్కొండ లో  నియోజకవర్గంలో అనేక చెరువులు ఎండాకాలం లో మత్తడి దుంకుతూ  నిండుగా ఉండేవి. కెసిఆర్ పాలనలో కాలంతో పని లేకుండా లిఫ్ట్ చేసి, వరద కాలువ ద్వారా, ఇతర మార్గాల ద్వారా నీళ్లు నింపేది. ఈ కాంగ్రెస్  ప్రభుత్వానికి  ప్రణాళిక లోపించండం వల్ల చెరువులు నిండక రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు మంచి వరద వస్తున్నప్పుడు కూడా లిఫ్ట్ ల ద్వారా నీటిని విడుదల చేసి చెరువులు నింపడం లేదు. రైతుల మీద ప్రేమ ఉండే ప్రభుత్వం ఉంటే రైతుల పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ కు  వరద కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి చౌట్పల్లి హన్మంత్ రెడ్డి,గుత్ప,అలీసాగర్ లిఫ్ట్,లక్ష్మీ లిఫ్ట్ మోటార్లు ఆన్ చేసి నీటిని పూర్తి స్థాయిలో విడుదల చేసి బాల్కొండ,ఆర్మూర్,నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో అన్ని చెరువులు నింపే ప్రయత్నం చేయాలని అన్నారు.