ఏబీవీపీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ ఎంట్రన్స్ శిక్షణ

నిజామాబాద్, బతుకమ్మ: పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ఏబీవీపీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఇందూర్ విభాగ్ కన్వీనర్ కైరి శశిధర్ తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థ అయిన ఏబీవీపీ విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావాన్ని పెంపొందిస్తూ ఎంతోమందిని దేశభక్తులకు తీర్చిదిద్దుతూ స్ఫూర్తిగా నిలిచిందన్నారు. విద్యార్థి సంఘాలు అంటే కేవలం ఆందోళనలు అనే సంస్కృతి ఉండేదని, 1949లో ఏబీవీపీ ఆవిర్భావం నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని, ఇందులో భాగంగానే పాలిటెక్నిక్ ఉచిత బోధన తరగతులు నిర్వహిస్తోందన్నారు. 1982లో...