జూన్ 16న పాలిసెట్ ధృవ పత్రాల పరిశీలన

  నందిపేట్, బతుకమ్మ :   నందిపేట్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల హెల్ప్‌ లైన్ కేంద్రంలో జూన్ 16న పాలిసెట్ చివరి విడత ధృవ పత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. రాజ్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంజనీరింగ్ డిప్లొమా ప్రవేశాల కోసం అర్హత సాధించిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అభ్యర్థులు జూన్ 15 లోపు tgpolycet.nic.in వెబ్‌సైట్‌లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలని తెలిపారు. స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు జూన్ 16న తమకు కేటాయించిన...