ఢిల్లీలో కొనసాగుతున్న పోలింగ్

న్యూ ఢిల్లీ, బతుకమ్మ: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. బుధవారం ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, 11గంటల వరకు 19.95శాతం ఓట్లు పోలయ్యాయి. రాష్ర్టపతి ద్రౌపతి ముర్ము, విదేశాంగ మంత్రి జయశంకర్, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అతీశీ, ప్రియాంకాగాంధీ వంటి ప్రముఖులు ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 13,776 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒకే దశలో పోలింగ్ జరుగుతుండగా, 1.56 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు....