Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 December 2025, 11:15 am Posted by : ramakrishna

నిజామాబాద్ లో ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్

నిజామాబాద్, బతుకమ్మ : 

నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఉదయం 7గంటలకు ప్రశాంతంగా ప్రారంభమయ్యింది. వణికించే చలిని సైతం లెక్క చేయకుండా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుండే ఓటర్లు బారులు తీరారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఎడపల్లి మండలం జానకంపేట, ఎం.ఎస్.సీ ఫారం లలో పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ తీరును, పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ వెంట అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు. 

Polling begins peacefully in Nizamabad