రైతుల దుఃఖాన్ని రాజకీయం చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ హైదరాబాద్, బతుకమ్మ : కష్టాల్లో ఉన్న రైతుల దుఃఖాన్ని రాజకీయ లాభం కోసం వినియోగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆదివారం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పర్యటించి ప్రభుత్వాన్ని విమర్శించడంపై ఆయన స్పందించారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఎల్లారెడ్డి నియోజకవర్గం గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు, వరదలతో తీవ్ర నష్టాన్ని చవిచూసింది....