Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 January 2026, 6:29 pm Posted by : ramakrishna

రాజకీయ పార్టీలు బీఎల్ ఏలును నియమించుకోవాలి

. . . సబ్ కలెక్టర్ కిరణ్మయి

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్ల(బీఎల్ ఏలు)ను నియమించుకోవాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి సూచించారు. బుధవారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం బాన్సువాడ మున్సిపల్ ఎన్నికలకు ముందు ఎన్నికల (ఎస్ఐఆర్) నిర్వహణ ప్రక్రియను అమల్లో ఉందన్నారు. ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు, తొలగింపుల పరిశీలిన కోసం బీఎల్ఎలు అవసరమన్నారు. జాగ్రత్తగా జాబితాలను పరిశీలించాలని సూచించారు. ఈ సమావేశంలో రమేష్ యాదవ్, మహమ్మద్ ఫాజిల్, ఆకిఫ్ హుస్సేన్, షర్ఫోద్దీన్ తదితరులు ఉన్నారు.