పొలిటికల్ ఎపైర్స్ కమిటీ సభ్యుడు ఈరవత్రి అనిల్ కు సన్మానం

మోర్తాడ్,బతుకమ్మ: తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్  ఈరవత్రి అనిల్ పొలిటికల్     ఎఫైర్స్ కమిటీ సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా మంగళవారం ఆయనను కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి గిర్మాజి గోపి ఆధ్వర్యంలో ఘనంగా శాలువాతో సన్మానించారు. జీవితంలో మరెన్నో ఉన్నత పదవులు పొందాలని కోరుకున్నారు. కార్యక్రమంలో మోర్తాడ్ వీడీ సీ అధ్యక్షుడు మోతే సుభాష్, గుర్రం అశోక్, నరేష్, సుదం, గిర్మాజి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.