Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 10:54 am Posted by : ramakrishna

ఏసీబీకి పట్టించిన పోలీసుల ఆన్ లైన్ ఆర్డర్స్

 

. . . లంచంతో పాటు ఆన్ లైన్ అర్డర్ లు ఇవ్వలేక ఏసీబీ ని ఆశ్రయించిన బాధితడు

 

. . . 5 లక్షల లంచం తీసుకున్న సీఐ,ఎస్ఐలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

పిడిఎస్ బియ్యం అక్రమ దందా పై కేసులు నమోదు చేసిన పోలీసులు, స్టేషన్ బెయిల్ కోసం లంచం డిమాండ్ చేసారు. లక్షల రూపాయలు లంచం తీసుకుంటూనే అది చాలదు అన్నట్టు ఆన్ లైన్ ఆర్డర్స్  కోసం బాధితుడిని వేధించారు. దానితో బాధితుడు ఏసీబీ ని అశ్రయించాగా గణేష్ బందోబస్త్ లో రాత్రి వేళ రూ. 5 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులుఎస్ఐ ని ఆయన ద్వారా లంచం డిమాండ్ చేసిన  సీఐ లను అరెస్ట్ చేసారు… పూర్తి వివరాలు…రేషన్ బియ్యం కేసులో స్టేషన్ బెయిల్ కోసం 10 లక్షలు డిమాండ్ చేశాడు కీసర సిఐ ఆంజనేయులు, ఎస్సై జ్ఞానేంద్ర రెడ్డి.. అటు ఇటు బేరం ఐదు లక్షల కి కుదిరింది.  ఈలోగా నిందితుడు వద్ద నుంచి బిర్యానీలు, డ్రింక్స్అంటూ ఇలా అనేక రకాలుగా అతడికి ఆర్డర్ పెట్టేవాళ్ళు. లంచం ఇచ్చేదికాక మళ్లీ ఈ రకమైన వేదింపులు.. ఇవి తట్టుకోలేక ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు . కీసర చెరువు వద్ద  వినాయక నిమజ్జనంలో ఉన్న ఎస్సైజ్ఞానేందర్ రెడ్డి లంచం మొత్తం అక్కడకు తెచ్చి ఇవ్వమన్నాడు. సిఐఆంజనేయులు కూడా అక్కడే ఉన్నాడు. వినాయక నిమజ్జనం సాక్షిగా ఐదు లక్షలు లంచం తీసుకుంటు ఉండగా , ఏసీబీ అధికారులు మాటేసి వెంటనే పట్టేశారు. అయితే లంచం తీసుకున్న మహానుభావులు కెమికల్ టెస్ట్ చేయించు కోకుండా  పరుగులు పెట్టారు. ఏసీబీ అధికారులు వెంబడించి, పట్టేసి ఎలాగైతేనేమి ఇద్దరికీ కెమికల్ టెస్ట్ చేయించి అరెస్టు చేశారు.

Police's online orders lead to ACB trap
Police’s online orders lead to ACB trap