బొందెం చెరువు కబ్జాలపై పోలీస్ శాఖ కొరడా
బీఆర్ఎస్ కార్పొరేటర్ భర్తతోపాటు ఐదుగురి అరెస్ట్ పరారీలో నలుగురు కేసు విచారణ కొనసాగుతోందంటున్న పోలీసులు బతుకమ్మ, నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని బొందెం చెరువు ఆక్రమణలపై అధికార యంత్రాంగం కొరడా ఝుళిపించగా, పోలీసుశాఖ బాధ్యులపై చర్యలు తీసుకుంటోంది. పదో డివిజన్ కార్పొరేటర్ కోమలి భర్త నరేశ్ తోపాటు నకిలీ పట్టాలు తయారుచేసిన కోటగల్లి జావిద్, స్థానిక మహిళా లీడర్ కమలమ్మ, బీ ఆర్ ఎస్ నాయకుడి ప్రధాన అనుచరుడైన మక్కల గోపాల్, మస్తాన్ ను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కూల్చివేత నుంచి...