Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 April 2025, 7:53 pm Posted by : ramakrishna

వీర శైవ లింగాయత్ సమాజ్ సభ్యులను అడ్డుకున్న పోలీసులు

బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : కేదార్ శివాచారి మహారాజ్ నిజామాబాద్ నగరంలోని నందిగుట్ట విగ్రహ ప్రతిష్టాపన కోసం బుధారం నిజామాబాద్ కు వచ్చారు. శాంతియుతంగా గురుద్వార్ నుంచి గాజుల్ పేట్ వీరభద్ర స్వామి గుడి వరకు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న ర్యాలీని పోలీసులు నగరంలోని రెండవ టౌన్ పరిధిలో అడ్డుకున్నారు. దీంతో వీరశైవ లింగాయత్ సమాజ్ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సంఘటన స్థలానికి చేరుకున్న త్రీ టౌన్ ఎస్ఐ హరిబాబు, రెండవ టౌన్ ఎస్ఐ హనుమాన్లు పరిస్థితిని సముదాయించు ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో బిజెపి మాజీ కార్పొరేటర్ ఇల్లందులో మమతా ప్రభాకర్ , బిజెపి నాయకులు బాలకృష్ణ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Police stop members of Veera Shaiva Lingayat Samaj