పోలీస్ స్పోర్ట్స్అండ్ గేమ్స్ మీట్- 2025లో జిల్లాకు 26 పతకాలు
పతకాలు సాధించిన పోలీసులను అభినందించిన ఇంచార్జి కమిషనర్ సింధూశర్మ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర 3 వ పోలీస్ స్పోర్ట్స్అండ్ గేమ్స్ మీట్- 2025 కరీంనగర్ లో నిర్వహించారు. పోలీస్ మీట్ లో బాసర జోన్-2తరపున నిజామాబాద్ క్రీడాకారులు సత్తా చాటారు. వివిధ రంగాలలో 61 మంది క్రీడాకారులు పాల్గొని 26 పతకాలు సాధించారు. క్రీడాకారులను నిజామాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ సి.హెచ్.సింధు శర్మ అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) జి.బస్వారెడ్డి,అడిషనల్ డసీపీ (ఏ.ఆర్) కె.రామ్ చందర్...