- అసూయ.. పగతో బాలుడిని హత్య చేసిన తల్లీకొడుకులు
- ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలింపు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
నిజామాబాద్ నగరంలో మార్చీ 27 న కిడ్నాప్ కు గురై తరువాత హత్య గావించబడ్డ బాలుడి కేసును పోలీసులు సాంకేతిక సామర్థ్యంలో ఛేదించినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ఈమేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మహరాష్ట్ర లోని నాందేడ్ జిల్లా నయాబాదికి చెందిన కైలాష్ (14 నెలల) బాలుడు మార్చీ 27న నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో తల్లి కమల బాయితో నిద్రించగా తెల్లవారే సరికి బాలుడు కనిపించకపోవడంతో బాధితుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే 28న ఉదయం నిజామాబాద్ నగరంలోని మూడవ టౌన్ పరిధిలోని ఉమెన్స్ కళాశాల మైదానం ప్రహరి పక్కన గుర్తు తెలియని బాలుడి అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు. ఈ రెండు కేసులలో బాలుడి కిడ్నాప్ , హత్య కేసును నమోదు చేసి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి గాలించారు. సోమవారం మాలపల్లి మసీద్ వద్ద నాందేడ్ జిల్లా ధర్మబాద్ తాలుకా కేంద్రంలోని సరస్వతి నగర్ కు చెందిన తల్లీకొడుకులు బోస్లే మాలా బాయి, బొస్లే గోపాల్ లను అనుమానాస్పదంగా బిక్షాటన చేస్తుండగా అదుపులోకి తీసుకోవడంతో కేసు కొలిక్కివచ్చింది. మాలబాయి, కమల బాయిలు నగరంలో బిక్షాటన చేస్తుండగా ఇద్ధరిలో చిన్నపిల్లలు ముగ్గురు ఉండటంలో బిక్షటాన ఎక్కువగా జరుగడంతో అసూయ పెంచుకున్నారు. అదే విధంగా మాలబాయి భర్తను కమల బాయి హత్య చేసిందని అనుమానంతో రైల్వే స్టేషన్ లో బాలుడు కైలాష్ ను ఎత్తుకెళ్లారు. నగరంలోని మూడవ టౌన్ ఏరియాలో బాలుడిని బండరాయితో మోది హత్య చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించారు. తల్లీకొడుకులను అరెస్టు చేసి కోర్టులో హజరు పరుచగా న్యాయస్థానం రిమాండ్ విధించినట్లు సిపి తెలిపారు. ఈ కేసులో నిజామాబాద్ ఒకటవ టౌన్ ఎస్ హెచ్ఓ రఘుపతి, ఎస్ఐ రాజేశ్వర్, కానిస్టెబుళ్లు గంగారాం, రాంబాబు, రవి, అనుషలు టీం వర్క్ చేసి బాలుడి కిడ్నాప్ , హత్య కేసు ఛేదించినందుకు అభినందించారు.