Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 May 2026, 7:49 pm Posted by : ramakrishna

పండుగల వేళ శాంతిభద్రతల పరిరక్షణ కు పోలీసులకు సహకరించాలి

 

. . . ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు

ఎల్లారెడ్డి, బతుకమ్మ:

పండగల సమయంలో ప్రజలు పరస్పర సహకారంతో శాంతి భద్రతల పరిరక్షణ కు పోలీసులకు సహకరించాలని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు కోరారు. ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల్లో సామరస్య వాతావరణం కొనసాగింపుపై సోమవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు  ముఖ్య అతిథిగా హాజరై ప్రజాప్రతినిధులు, మత పెద్దలు, యువజన సంఘాల నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని, ఎలాంటి అనుమానాస్పద ఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సమావేశంలో ఎల్లారెడ్డి సీఐ రాజిరెడ్డి మాట్లాడుతూ ప్రజలు చట్టాన్ని గౌరవిస్తూ సామాజిక బాధ్యత వ్యవహరించాలి అని తెలిపారు. ఎలాంటి వివాదాలు తలెత్తినా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ఎల్లారెడ్డి ఎస్‌ఐ ఎన్ రాజు మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువజన సంఘాల సభ్యులు, వివిధ వర్గాల ప్రజలు పాల్గొన్నారు.