. . . సిజేపి అదినేత అభిజీత్ దీప్కే దీక్ష ప్రారంభం
వెబ్ డెస్క్, బతుకమ్మ:
నీట్ పేపర్ లీకేజి కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ సోనమ్ వాంగ్ చూక్ చేస్తున్న అమరణ నిరహర దిక్షను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు.ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 21 రోజులుగా నిరవధిక అమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్‌ను శనివారం వైద్యుల సూచనల మేరకు ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా, ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అత్యవసర వైద్య చికిత్స కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. సోనమ్ వాంగ్ చుక్ ను పోలీసులు ఆస్పత్రికి తరలించగా జంతర్ మంతర్ వద్ధ కాక్రోచ్ జనత పార్టి అధ్యక్షుడు అభిజీత్ దీప్కే నిరాహార దీక్ష ప్రారంభించారు. సోనమ్ వాంగ్ చూక్ ఆసుపత్రిలో వైధ్యులకు సహకరిస్తారా లేక దిక్ష కోనసాగిస్తారా అనేది వెచి చూడాలి.
