Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 December 2024, 5:44 pm Posted by : ramakrishna

ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఒకరిని కాపాడిన పోలీసులు

నిజాంసాగర్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రం లో ని నిజాంసాగర్ ప్రాజెక్టులో గురువారం ఆత్మహత్యాయత్నం చేసిన ఒకరిని నిజాంసాగర్ పోలీసులు కాపాడారు.  సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల కేంద్రానికి చెందిన ఆంజనేయులు నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్నాడు. అటువైపు నుండి వస్తున్న నిజంసాగర్ ఏఎస్ఐ రాజేశ్వర్, హోంగార్డ్ సాయిలు ఆంజనేయులును అరా తీయగా ఆత్మహత్య  చేసుకోవడానికి వచ్చానని తెలపడంతో వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి, అతని తండ్రికి అప్పజెప్పారు. దీంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులను అభినందనలు తెలిపారు.