Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 December 2024, 8:01 pm Posted by : ramakrishna

పోచారం ప్రాజెక్టులో ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కాపాడిన పోలిసులు

నాగిరెడ్డిపేట , బతుకమ్మ:

కుటుంబ సభ్యులతో గొడవపడి పోచారం ప్రాజెక్టులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని పోలిసులు కాపాడారు.నాగిరెడ్డిపేట ఎస్ఐ మల్లారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాదులోని సుచిత్ర ప్రాంతానికి చెందిన అన పోజు వినయ్ తేజ (28) అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో గొడవపడి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. నాగిరెడ్డి పేట్ మండలం పోచారం ప్రాజెక్టు వద్దకు సోమవారం వచ్చి ప్రాజెక్టులో దూకి ఆత్మహత్యకు పాల్పడుతుండగా స్థానికులు నాగిరెడ్డిపేట పోలీసులకు సమాచారం అందించారు. హుటా హుటిన  ప్రాజేక్టుకు  చెరుకున్న కానిస్టేబుల్ చంద్రయ్య, హోంగార్డ్ కాశయ్య లు ఆత్మహత్యకు యత్నిస్తున్న వినయ్ తేజను కాపాడి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసి అప్పజెప్పినట్లు ఎస్ఐ తెలిపారు.