Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 January 2026, 7:02 pm Posted by : ramakrishna

రోడ్డుకు అడ్డంగా ఉన్న ముళ్ల పొదలను తొలగించిన పోలీసులు

కామారెడ్డి, బతుకమ్మ :

 

 

కామారెడ్డి జిల్లా బిచ్కుంద పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్న దేవుడ గ్రామం ఎంట్రెన్స్ వద్ద, మెయిన్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు, ముళ్ళ కంపలు వాహనదారులకు, పాదచారులకు ఇబ్బందులు కలిగిస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న నేపథ్యంలో, ప్రజల భద్రతను ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని బిచ్కుంద పోలీసు వారు చర్యలు చేపట్టారు. ఈ చర్యలలో భాగంగా జెసిబి సహాయంతో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు, ముళ్ళ కంపలను పూర్తిగా తొలగించడం జరిగించారు. దీని వలన రోడ్డుపై ప్రయాణించే వాహనదారులకు స్పష్టమైన దృష్టి లభించేలా, ప్రమాదాల నివారణకు అవకాశం కలిగించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఇటువంటి కార్యక్రమాలు కొనసాగించబడతాయని బిచ్కుంద ఎస్సై జి రాజు తెలిపారు.

 

Police removed thorn bushes across the road