Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 November 2026, 7:02 pm Posted by : ramakrishna

పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు

 

– 16 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్

– రూ. 38570 నగదు స్వాధీనం

రుద్రూర్, బతుకమ్మ:

దీపావళి పండుగ సందర్బంగా రుద్రూర్ మండల కేంద్రంలోని అక్బర్ నగర్ గ్రామంలో పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు రుద్రూర్ ఇంచార్జ్ ఎస్సై ఎల్. రామ్ తన సిబ్బందితో పేకాట స్థావరంపై దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న ఏడుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.6,120 నగదును స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేశారు.

… బొప్పాపూర్ గ్రామంలో పేకాట స్థావారం పై 

రుద్రూర్ మండలంలోని బొప్పాపూర్  గ్రామంలో పేకాట స్థావరంపై దాడులు నిర్వహించగా, పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.6,350 నగదును స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు ఇంచార్జ్ ఎస్సై ఎల్. రామ్ తెలిపారు. పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.

Police raids on gambling dens

…రాయకూర్ లో

రుద్రూర్ మండల కేంద్రంలోని రాయకూర్ గ్రామంలో పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు పేకాట స్థావరం పై దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.26,100 నగదు, రెండు మొబైల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.