Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 November 2025, 5:42 pm Posted by : ramakrishna

బ్రహ్మణపల్లి శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

విశ్వసనీయమైన సమాచారం ఆధారంగా ఎల్లారెడ్డి పోలీసులు బ్రహ్మణపల్లి గ్రామ శివారు ప్రాంతాల్లో దాడి నిర్వహించి, జూదం ఆడుతున్న కొంత మందిని పట్టుకున్నారు. ఈ దాడిలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.12,510 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు, మూడు మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై సంబంధిత చట్టపరమైన సెక్షన్ ప్రకారం తెలంగాణ గేమింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ప్రజలు ఇలాంటి అక్రమ జూద కార్యకలాపాలలో పాల్గొనకుండా ఉండాలని, శాంతి భద్రతల పరిరక్షణ కు పోలీసులకు సహకరించాలని ఎల్లారెడ్డి పోలీసులు కోరుతున్నారు.