బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని సోమవారం రాత్రి పెద్ద మల్లారెడ్డి, జంగంపల్లి, కాచాపూర్ గ్రామాలలో పేకాట స్థావరాలపై మెరుపు దాడి నిర్వహించారు. భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు నేతృత్వంలో జరిగిన దాడిలో 16మంది పేకాట రాయుళ్లు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 24680 రూపాయలు 10 మొబైల్ 9 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. జూదం వంటి చట్టా వ్యతిరేక కార్యకలాపాలకు ప్రజలు దూరంగా ఉండాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలపలాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు.

