Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 August 2025, 6:40 pm Posted by : ramakrishna

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

  • 9మంది అరెస్ట్

 

నందిపేట్, బతుకమ్మ : నందిపేట్ మండలంలో పేకాట స్థావరంపై గురువారం పోలీసులు దాడి చేసినట్లు ఎస్ఐ శ్యాంరాజ్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని నూత్ పల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు నందిపేట్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 9 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.39,100 నగదు స్వాధీనం చేసుకున్నారు.