Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 May 2026, 4:55 pm Posted by : ramakrishna

జూద స్థావరంపై పోలీసుల మెరుపు దాడి

 

. . . ఐదుగురు అరెస్ట్

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లాలో అక్రమ జూద కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతంగల్ అటవీ ప్రాంతంలో రహస్యంగా నిర్వహిస్తున్న జూద స్థావరంపై సోమవారం రాత్రి పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. పోలీసుల దాడిలో ఐదుగురు జూదరులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.48,100 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు, నాలుగు బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర, మాట్లాడుతూ జూదం కుటుంబాలను చిన్నాభిన్నం చేసే మహమ్మారి, ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని హెచ్చరించారు. జిల్లాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని తెలిపారు. అలాగే ప్రజలు తమ ప్రాంతాల్లో జూదం లేదా ఇతర అక్రమ కార్యకలాపాలు గమనించిన వెంటనే డయల్ – 100 కు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.