Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 1:14 pm Posted by : ramakrishna

బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు

 

. . .  కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ 

 

. . . అరెస్టులను తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ నాయకులు…

 

బాన్సువాడ బతుకమ్మ :

 

తెలంగాణ అసెంబ్లీ ముట్టడి కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం బాన్సువాడలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.ఈ చర్యను మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలను నమ్మబలికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. నమ్మకద్రోహానికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్… ఆరు గ్యారంటీలు ఎక్కడ అంటూ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు.ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న నాయకులను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని స్థానిక బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.అరెస్టు అయినా వారిలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్షేక్ జుబేర్, కౌన్సిలర్లు, ఫెరోజ్, ఖలీల్, బీఆర్ఎస్వి నాయకులు ఎర్రవట్టి సాయిబాబా, రమేష్ యాదవ్ తదితరులు ఉన్నారు.