. . . పోలీస్ కమీషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
పోలీసు ప్రజావాణిలో 16 ఫిర్యాదులు స్వీకరించినట్లు పోలీసు కమిషనర్ సాయిచైతన్య తెలిపారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం సీపీ సాయి చైతన్య ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ ల ఎస్.ఐ, సిఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకొనేలా పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని సీపీ తెలిపారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నామని తెలిపారు.