Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 October 2025, 7:44 pm Posted by : ramakrishna

పాస్ పోర్టు విచారణను నిర్లక్ష్యం చేసిన పోలీసుల సస్పెన్షన్

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో పాస్ పోర్టు విచారణ సమయంలో నిర్లక్ష్యం వహించిన ఒక ఏఎస్సై, హెడ్ కానిస్టేబుళ్ళను సస్పెండ్ చేస్తూ ఇంచార్జి డీఐజీ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డి జిల్లాలో స్పెషల్ బ్రాంచ్ లో పని చేస్తున్న సమయంలో ఏఎస్సై నర్సయ్య, హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డిలు పాస్ పోర్టు విచారణ సమయంలో నిర్లక్ష్యం చేశారని దానిపై అధికారులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం బిక్కనూర్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్సైగా పని చేస్తున్న నర్సయ్య, రామారెడ్డి పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డిలు విధినిర్వహణలో నిర్లక్ష్యం వాస్తవమేనని తేలడంతో వారిపై వేటు వేస్తూ మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.