అదృశ్యమైన విద్యార్థిని రెండు గంటల్లో గుర్తించిన పోలీసులు
భిక్కనూర్, బతుకమ్మ : భిక్కనూర్ మండలంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల నుంచి కనిపించకుండా పోయిన 5వ తరగతి విద్యార్థిని భిక్కనూర్ పోలీసులు కేవలం రెండు గంటల్లోనే గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే, గురువారం ఉదయం ప్రార్థన కార్యక్రమం అనంతరం పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన కమ్మరిపల్లి రుత్విక్ (10), తండ్రి రాజు అనే విద్యార్థి పాఠశాల నుంచి కనిపించకుండా పోయాడు. ఈ విషయాన్ని గమనించిన కళాశాల ప్రిన్సిపాల్ సాబావత్ రఘు మధ్యాహ్నం సుమారు 12 గంటలకు...