నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ నగరం లోని ఐదవ టౌన్ పరిది లో గల నాగారం లో నివాసం ఉండే మహమూద్ బేగ్ అలియాస్ ఫిద్దు అనే రౌడీ షీటర్ కు నగర బహిష్కరణ ఉత్తర్వులు అందించినట్లు నిజామాబాదు పోలీసు కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లాలోని పలు పోలీసు స్టేషన్ ల పరిది లో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న రౌడీ షీటర్ ఫిద్దు ప్రజలను భయ బ్రాంతులకి గురి చేస్తున్నాడని, గతం లో మర్డర్ కేసు తో పాటు పలు కేసులలో నిందితుడిగా ఉన్నాడన్నారు. నేరాలకు పాల్పడుతున్న రౌడీ షీటర్ ఫిద్దు ని జిల్లా నుండి బహిష్కరిస్తూ నిజామాబాదు పోలీసు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.