. . . ఇంచార్జీ పోలీస్ కమిషనర్ రాజేష్ చంద్ర
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నూతన సంవత్సర వేడుకలపై ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఏవరైన అతిక్రమించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమిషనర్ ఎం. రాజేష్ చంద్ర హెచ్చరించారు. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా మత్తులో రోడ్డుపై వేగంగా, ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారకులు కాకూడదని, నిజామాబాద్ ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అప్రమత్తమై పక్క కార్యాచరణతో రంగంలోకి దిగుతున్నారు అని తెలిపారు. ఎక్కడ కూడా పోలీస్ అనుమతి లేకుండా న్యూ ఇయర్ కార్యక్రమాలు (ఫామ్ హౌస్ , క్లబ్స్ ,గేటెడ్ కమ్యూనిటీ) నిర్వహించరాదు అన్నారు. వాటిని కూడా పరిమితి మించకుండా సౌండ్ వాడరాదు. ప్రజలను భయాందోళనకు, ఇబ్బందులకు గురి అయ్యే విధంగా క్రాకర్స్ ” ఆర్.కె స్ట్రా” సౌండ్ సిస్టం లేదా అత్యధిక మోతాదులో గల సౌండ్ సిస్టమ్ (డి.జె ) ఏర్పాట్లు నిషేధించడం జరిగిందన్నారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ముఖ్యంగా నూతన సంవత్సర వేడుకలు ఎక్కువ నిర్వహించే అవకాశం ఉంటుంది. కావున ఈ వేడుకల సందర్భంగా ప్రతి వాహనదారుడు తూ.చ తప్పకుండా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించేలా పోలీసు సిబ్బంది చర్యలు తీసుకుంటామన్నారు.
నూతన సంవత్సర వేడుకలపై నిఘా..
కమిషనరేట్ పరిధిలోని అన్నిపోలీస్ స్టేషన్ సాయంత్రం 6 గంటల నుండి ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేపట్టనున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ సందర్భం గా ఫోటో గ్రాఫి ,వీడియో గ్రాఫ్ తీసిన తర్వాత వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేయడం జరుగుతుందని, పోలీస్ వారి నిబంధనలు ఎవ్వరైన అతిక్రమించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. బహిరంగ ప్రదేశంలో మద్యపానం నిషేధం, కేక్ కటింగ్ లు, బైక్ రేసింగ్ ల నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఇంచార్జీ సీపీ రాజేష్ చంద్ర హెచ్చారించారు.