. . . ఆనందం వ్యక్తం చేసిన బాలుడు
నిజమాబాద్, బతుకమ్మ :
ఓ బాలుడి సైకిల్ చోరీ కావడంతో పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో తిరిగి అప్పగించడంతో బాలుడి సంతోషా నికి హద్ధులు లేకుండా పోయింది. ఖానాపూర్ గ్రామానికి చెందిన అంగన్ వాడి టీచర్ తన బాబు సైకిల్ ఎవరో తీసుకెళ్లారని సమాచారం ఇవ్వడంతో రోహిత్, రాజు కానిస్టేబుల్ ఇద్దరు గ్రామానికి వెళ్లి సీసీ కెమెరాల సహాయంతో మూడు గంటల పాటు వెతికి చివరకు గ్రామ చివర ఉన్న ఇటుక బట్టి వద్ద సైకిల్ ను అబ్బాయి కి అప్పగించారు. దీంటో బాలుడి కి అప్పుడే సంక్రాంతి సంబరం ప్రారంభమైనట్లయినది. బాలుడి తో పాటు తల్లి ఆనంధం వ్యక్తం చేశాడు. పోలీసులుచిన్న విషయమ ని వదిలేయకుండా సైకిల్ ని వెతికి పెట్టడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. చిన్న చిన్న సమస్యలకే కాకుండా, ఎంతో పెద్ద పెద్ద సమస్యలు కూడా సీసీ కెమెరాల సహాయం తో పరిష్కారం అవుతాయన్నారు. గ్రామ ప్రజలు అందరూ కూడా గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని గ్రామాన్ని సేఫ్ విలేజ్ గా మార్చుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.