Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 November 2025, 8:04 pm Posted by : ramakrishna

తిరుమలయ్య గుడి దొంగతనం కేసును చేదించిన పోలీసులు

  • పెట్రోలింగ్ చేస్తూన్న సమయంలో పట్టుబడ్డ నేరస్తుడు
  • ఎస్సై సందీప్,సిబ్బందిని అభినందించిన సీఐ వినోద్

 

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని నల్లవెల్లి గ్రామంలోని తిరుమలయ్య గుడి లో గత నెలలో తిరుమలయ్య గుడిలో నుండి కొత్త సురేష్ అమ్మవారి బంగారు పుస్తెలు ఆరున్నర గ్రాములు,వెయ్యి రూపాయలు,గుడిలో ఉన్న హుండీ తాళం పగలగొట్టి అందులోనుండి 1500 రూపాయలు దొంగిలించాడని తెలిపారు.అలాగే నేరస్థుడి వద్ద వివో సెల్ఫోన్ లభ్యమైందని తెలిపారు. తిరుమలయ్య గుడిలో నుండి అపహరించడంతో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.వివరాలలోకి వెళితే నల్లవెల్లి తిరుమలయ్య గుడి మందిరంలోకి కొత్త సురేష్ అనే వ్యక్తి గుడిలోనికి చొరబడి బంగారు ఆభరణాలతో పాటు డబ్బులు దొంగిలించినట్లు సిఐ వినోద్ తెలిపారు.లింగాపూర్ స్టేజ్ వద్ద ఉదయం పెట్రోలింగ్ చేస్తుండగా కొత్త సురేష్ పైన అనుమానం వచ్చి పట్టుకున్నట్లు తెలిపారు.నేరస్థుడు సురేష్ వద్ద నుండి ఆరున్నర గ్రాముల బంగారు పుస్తెలు,1000 రూపాయలు, వివో సెల్ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్టు సిఐ వినోద్ తెలిపారు. నేరస్తుడు నల్లవెల్లి గ్రామానికి చెందిన వాడు కావడం విశేషం. ఏసిపి రాజారత్నం ఆధ్వర్యంలో కేసు చేదించడంలో ముఖ్యపాత్ర వహించిన ఎస్సై జి సందీప్ పోలీసు సిబ్బంది కిరణ్, ప్రశాంత్,కిషోర్ కుమార్లను సీఐ వినోద్ అభినందించారు.