Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 November 2026, 5:47 pm Posted by : ramakrishna

సదాశివనగర్ మండలంలో  పేకాట స్థావరాలపై పోలీసుల మెరుపు దాడులు

 

. . . 13 మంది అరెస్ట్

 

సదాశివనగర్, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల పరిధిలో జూదం కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆదివారం రాత్రి సదాశివనగర్ పోలీసులు మండలంలోని వివిధ గ్రామాల శివారుల్లో  దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు భూంపల్లి , పద్మాజీవాడి, మల్లుపేట్ గ్రామాల శివారుల్లో నిర్వహించిన దాడుల్లో జూదం ఆడుతున్న 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని, వారిపై మూడు కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో నగదు, మొబైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా ఎస్సై పుష్పరాజ్ మాట్లాడుతూ  జూదానికి బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని కుటుంబాలను రోడ్డున పడనీయొద్దని జూదం జీవితాన్ని చిన్నాభిన్నం చేసే వ్యసనాలకు యువత బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని సదాశివ నగర్ ఎస్సై పుష్పరాజ్ సూచించారు  చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై పోలీసుల నిఘా నిరంతరం కొనసాగుతుందని, జూదం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఇలాంటి కార్యకలాపాల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఎస్సై పుష్పరాజ్ కోరారు.