దర్శకుడు రాజమౌళిపై పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్, బతుకమ్మ : సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి పై రాష్ట్రీయ వానరసేన పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల వారణాసి చిత్రం కార్యక్రమంలో హనుమంతుడిపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉన్నాయని సరూర్ నగర్ పోలీసులకు రాష్ట్రీయ వానరసేన ఫిర్యాదు చేసింది. రాజమౌళిపై కేసు నమోదు చేసి భవిష్యత్తులో ఎవరూ హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ వానరసేన సంఘం సభ్యులు పోలీసులను కోరింది. హిందూ దేవుళ్ళ పేర్లు చెప్పి వేల కోట్లు...